మాచర్ల ఎం.ఎల్.ఏ పై దాడి చేసింది వీరేనా?

0
208

మాచర్ల ఎం.ఎల్.ఏ పై దాడి చేసింది వీరేనా?

రాజధాని రైతులు పిలుపునిచ్చిన జాతీయ  రహదారుల  నిర్బంధం కార్యక్రమంలో ఉద్ధ్రిక్తత నెలకొంది. రోడ్డు పై బైఠాయించి ఆందోళన  చేస్తున్న  సమయంలో అటువైపుగా  వచ్చిన మాచర్ల  ఎం .ఎల్ .ఏ  పిన్నెళ్ళి  రామకృష్ణారెడ్డి  కారును  ఆందోళనాకారులు అడ్డగించారు. ముందుగా  ఎం .ఎల్ .ఏ  వాహనానికి  మరొక  కారును  అడ్డుగా పెట్టి తమ  నిరసన  వ్యక్తం చేసారు. ఈ క్రమంలో ఆందోళన  కారుల  ముసుగులో ఉన్న  కొంత  మంది వ్యక్తులు పిన్నెళ్ళి పై  దాడికి  యత్నించారు, అడ్డుకోబోయిన గన్ మాన్ ను ఇష్టానుసారం కొట్టారు. అంతటితో ఆగకుండా ఎం.ఎల్.ఏ కారు పై రాళ్ళ వర్షం కురిపించారు. ఆందోళనకారులతో మాట్లాడడానికి పిన్నెళ్ళి  రామకృష్ణారెడ్డి ప్రయత్నించినా కూడా ఫలితం  లేకుండా పోవడంతో పోలీసుల  సహాయంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. సీ. ఎం జగన్ తో భేటీ  అనంతరం మీడియా  తో మాట్లాడిన ఎం.ఎల్.ఏ  పిన్నెళ్ళి  రామకృష్ణారెడ్డి ఇవన్నీ చంద్రబాబు ఆడుతున్న డ్రామాలని, వాటికి తాను భయపడనని తెలిపారు. మాచర్ల ఎం.ఎల్.ఏ పై దాడి చేసింది వీరేనా? చదవండి క్రింద…

గన్ మన్ పై పిడిగుద్దులు

జాతీయ రహదారి పై జరుగుతున్న ధర్నా నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త  చర్యలు తీసుకోవడంలో కొంత నిర్లక్ష్యం గా వ్యవహరించారు. సర్వీస్ రోడ్ పై ఎం.ఎల్.ఏ వాహనాన్ని అడ్డగించిన చాలా సేపటి  తర్వాత  మాత్రమే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఎం.ఎల్.ఏ కి రక్షణా కవచం గా  ఉన్న గన్ మన్ పై ఒక  యువకుడు తీవ్రంగా  దాడిచేసాడు. అయినప్పటికీ సిబ్బంది  సంయమనం పాటించి తమ  విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విచారణ చేసిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

కర్రలు, రాళ్లతో దాడి, మాజీ వైస్ ప్రెసిడెంట్ హస్తం?

ధర్నా కొనసాగుతున్న సమయంలో అటుగా వచ్చిన అధికార పార్టీ ఎం.ఎల్.ఏ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి చేసిన సంఘటన  అనేక  అనుమానాలకు దారితీస్తుంది. అయితే మీడియాలో వచ్చిన విజువల్స్ ప్రకారం దాడి కి పాల్పడిన  వ్యక్తులను గుర్తించే క్రమంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. గుంటూరు జిల్లా తాడికొండ  గ్రామానికి చెందిన  కొంత  మంది వ్యక్తులు ఈ దాడికి  పాల్పడినట్లు ప్రాధమికంగా గుర్తించారు. గ్రామానికి చెందిన మాజీ వైస్ ప్రెసిడెంట్ అతని అనుచరులు ఈ దాడిలో  పాల్గొన్నట్టు అనుమానం  వ్యక్తం చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని వారినుంచి మరింత  సమాచారం  కోసం పోలీసులు  ప్రయత్నిస్తున్నారు.

మాచర్లలో ఉద్రిక్త  పరిస్థితులు! 

తమ  ఎం.ఎల్.ఏ పై జరిగిన  దాడికి  నిరసనగా మాచర్ల  పట్టణంలో అధికార పార్టీ శ్రేణులు ఆందోళన  నిర్వహించాయి. దాడికి  పాల్పడిన  వారిని  వెంటనే శిక్షించాలని కోరుతూ  మాచర్ల  పట్టణ వీధులలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన  నిర్వహిస్తున్న  వారికి పోలిసులు  నచ్చచెప్పి పంపించే ప్రయత్నం చేసారు. అనేక  ఉద్రిక్తతల  మధ్య రాజధాని  రైతుల  ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here