రాజధాని తరలింపు కు మూహూర్తం ఫిక్స్ !

0
196

రాజధాని తరలింపు కు మూహూర్తం ఫిక్స్ !

రాజధాని తరలింపు కు మూహూర్తం ఫిక్స్ ! రాజధాని మార్పు పై గత  కొన్ని  రోజులుగా అమరావతి  ప్రాంతం  లో ఆందోళనలు  జరుగుతున్న  విషయం  విదితమే. తుళ్లూరు  నుంచి  రాజధానిని  తరలించొద్దు  అంటూ రైతులు  ఆందోళనలు  ఉధృతం చేస్తున్నారు. ఈ  నేపధ్యం  లో రాష్ట్ర  ప్రభుత్వం  అధికారులతో  పలు  కీలక  అంశాలపై  చర్చించిన  విషయాలు  రైతులను  మరింత  ఆందోళనకు  గురిచేస్తున్నాయి. వచ్చే  ఉగాది  నాటికి  ప్రభుత్వ  శాఖలు  మొత్తాన్ని  విశాఖ కు  తరలించేందుకు ప్రభుత్వం వడి వడిగా అడుగులు  వేస్తుంది. ఇప్పటికే  జి .ఎన్  రావు  కమిటీ మరియు  రాష్ట్ర  ప్రభుత్వం  నియమించిన  బోస్టన్  కమిటీ రాజధాని  మార్పు  పై  పలు  రకాల  నివేదికలు  సమర్పించాయి. రెండు  కమిటీలు  విశాఖను  పరిపాలనా  రాజధానిగా ఏర్పాటు  చేయటానికే  మొగ్గుచూపాయి.

ప్రత్యేక  అసెంబ్లీ  సమావేశాలు:

ఇదిలా  ఉండగా విజయవాడ , గుంటూరు  లో ఉన్న  పలు  కీలక  శాఖల  తరలింపుకు ప్రభుత్వం  నుంచి  అధికారులకు  స్పష్టమైన  ఆదేశాలు  వచ్చినట్టు  ప్రభుత్వ  వర్గాలు  తెలిపాయి. ఇందులో  భాగంగా  ఈ  నెల 20వ  తేదీన  ప్రత్యేక  అసెంబ్లీ  సమావేశాలకు  ప్రభుత్వం  సిద్ధం  అవుతుంది. న్యాయపరమైన  చిక్కులు  లేకుండా  ఉండటానికి  వచ్చే  అసెంబ్లీ  సమావేశాలలో  పలు  కీలకమైన తీర్మానాలకు ప్రభుత్వం  ఆమోదం తెలపనుంది.

విశాఖలో కొత్త సచివాలయం ఇక్కడే!

రాజధాని తరలింపు ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో కొత్త  సచివాలయం ఎక్కడ  అనే  విషయం లో సందిగ్దత నెలకొంది. విశాఖపట్టణం  లోని భీమిలి ప్రాంతంలో రాజధాని రాబోతుంది అనే ప్రకటనలతో అక్కడి  భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మిలీనియం టవర్స్ లో సచివాలయం  ఏర్పాటు  కాబోతోంది. దానికి  తగిన  విధంగా  సకల  సదుపాయాలు  కల్పన లో  అధికారులు  నిమగ్నం  అయ్యారు. పూర్తి  స్థాయి పరిపాలన  రాజధానిగా విశాఖను ఎంపిక  చేసిన  తరుణంలో దానికి తగిన రీతిలో పలు  కార్యాలయాలకు సంబంధించిన భవనాలను  అధికారులు  ఎంపిక  చేస్తున్నారు.

మా సంగతి ఏంటి?

పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల విషయమై రాయలసీమ  ప్రాంతంలో  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో సీమవాసులు కొంతమేర  లబ్ది  పొందినా  కానీ  అది ఎంతవరకు  ఆ ప్రాంత  అభివృద్ధికి  దోహదపడుతుంది అనే విషయం  చూడాల్సి ఉంది.

స్పెషల్ అగ్రికల్చరల్ జోన్ గా అమరావతి!

ఇది ఇంకా ప్రతిపాదనలో ఉన్న అంశం అని ప్రభుత్వం చాకచక్యం గా  ప్రకటనలు చేస్తుంది. ఇప్పుడు  అమరావతిలో  ఉన్న  భవనాలను  కొనసాగిస్తూనే వ్యవసాయ అభివృద్ధి  కేంద్రం  గ  అమరావతిని  తీర్చిదిద్దాలని  ప్రభుత్వం  భావిస్తోంది. అత్యంత  సారవంతమైన  భూములు  కలిగిన  అమరావతి  ప్రాంతాన్ని వ్యవసాయ  ఉత్పత్తులకు హబ్  గా  మార్చాలని అనేక  రకమైన  ప్రతిపాదనలు  ప్రభుత్వం  ముందుకి  వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here