A.Pలొ పంచాయతి ఎన్నికల షెడ్యూల్ విడుదల!

0
210

 A.Pలొ పంచాయతి ఎన్నికల షెడ్యూల్ విడుదల!

A.Pలొ పంచాయతి ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఎ.పి లో ఎన్నికల సందడి మొదలవబోతోంది, స్థానిక  సంస్థల ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలకు సంబందించిన ప్రక్రియ ను ప్రారంభించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు మార్చ్ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మూడు దశలలో ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. స్థానిక సమరానికి అన్ని పార్టీల నేతలు ఇప్పటినుంచే  సిద్ధమవుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రెండు దశలలో పరిషత్ ఎన్నికలు…

ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్  ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న పరిషత్  ఎన్నికలు రెండు  దశలలో జరగనున్నాయి. రెండు నెలల పాటూ సాగే ఈ స్థానిక సంస్థల ప్రక్రియకు ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మొదటిగా జనవరి  17వ  తారీఖున ఎం.పి.టీ.సి, జెడ్.పి.టీ.సి నోటిఫికేషన్ రానుంది. ఫిబ్రవరి 10వ  తేదీన  వాటికి సంభందించిన ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే అందుకు రెండురోజుల ముందు అంటే ఫిబ్రవరి 8వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంభందించిన నోటిఫికేషన్ ని విడుదల చేయాలనీ ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది.

మూడు  దశలలో  పంచాయతీ ఎన్నికలు...

గ్రామ పంచాయతీ కి సంభందించిన ఎన్నికలు మూడు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంభందించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 8వ తేదీన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చి  3వ తేదీ లోపు ఈ ప్రక్రియ ముగిసేలా అఫిడవిట్ ను ఎలెక్షన్ కమిషన్ హైకోర్టు కి సమర్పించిoది.

ఇప్పటికే రిజర్వేషన్ కు సంభందించిన సమాచారాo  మండల కార్యాలయాల నుంచి ఎన్నికల కమిషన్ కు చేరినట్టుగా తెలుస్తుంది. ఇదిలా  ఉండగా  రాజధాని ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ ఎలా కొనసాగించాలనే విషయం పై  అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.!

ఆమోదం తెలిపిన  న్యాయస్థానం!

ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్ ప్రక్రియ పై న్యాయస్థానం లో దాఖలైన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. 59.85% రేజర్వేషన్లకు న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఎన్నికల కమిషన్ సమర్పించిన అఫిడవిట్ ను నిశితంగా పరిశీలించిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు ఆమోదాన్ని తెలియచేయడంతో రిజర్వేషన్ కు సంభందించిన అడ్డంకులు తొలగిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here